కాంగ్రెస్ పార్టీకి చెంది సర్పంచ్‌లను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తూ సస్పెండ్ చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆరోపించారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన ఆధ్వర్యంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు.
'పంచాయతీరాజ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వచ్చింది'
పంచాయతీ రాజ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వచ్చిందంటే.. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయే స్థితికి చేరుకున్నట్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థపై మల్లు రవి వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని సర్పంచ్‌లపై ఒత్తిడి తీసుకువస్తున్నారని మల్లు రవి అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వచ్చిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యవస్థ బలోపేతానికి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత వీహెచ్ ఇతర కాంగ్రెస్ నేతలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి :బయటికి రండి... నిధులపై కలిసి పోరాడుదాం : పొన్నం