తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రధాన వార్తలు@3PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

ప్రధాన వార్తలు@3PM
ప్రధాన వార్తలు@3PM

By

Published : Dec 8, 2020, 3:01 PM IST

కేంద్రం అడ్డు

సన్నరకాలకు మద్దతు ధర ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోందని ఐటీ, మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. భారత్​ బంద్​లో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ బూర్గుల గేట్‌ వద్ద రహదారిపై బైఠాయించారు. కడుపుమండిన రైతులు దిల్లీలో 13 రోజులుగా ఆందోళన చేస్తున్నారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సుప్రీంకోర్టు అసంతృప్తి

చిగురుపాటి జయరాం హత్య కేసు నిందితుడి బెయిల్ పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిందితుడు రాకేశ్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారించిన జస్టిస్ ఎన్.వి.రమణ ధర్మాసనం... బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. జయరాం హత్య కేసులో పోలీసుల పాత్ర ఉందని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కేసీఆర్​కు ధర్నా చేసే హక్కు ఎక్కడిది?

కడుపు కాలితే రైతులే ధర్నా చేస్తారు.. జిల్లాకో మంత్రిని నియమించి ధర్నా చేయించడమేంటని ముఖ్యమంత్రి కేసీఆర్​పై భాజపా ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే త్వరలోనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

దోచిపెట్టే కుట్ర

సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్​ వద్ద భారత్ బంద్​లో భాగంగా మంత్రి తలసాని ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బైక్​లతో ర్యాలీ నిర్వహించారు. తలసాని స్వయంగా బైక్ నడిపి కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కొప్పులను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు

చొప్పదండిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కాన్వాయ్‌ను కాంగ్రెస్ అడ్డుకుంది. కాన్వాయ్ వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ శ్రేణుల నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు చెదరగొట్టడంతో మంత్రి వెళ్లిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

హజారే నిరాహార దీక్ష

రైతులకు మద్దతుగా ఒకరోజు పాటు నిరాహార దీక్ష చేపట్టారు సామాజిక కార్యకర్త అన్నా హజారే. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని... అప్పుడే కేంద్రం దిగొచ్చి రైతులకు న్యాయం చేస్తుందని అన్నారు. అయితే హింసకు పాల్పడకూడదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కర్షక భారతం కన్నెర్ర

రైతులకు మద్దతుగా యావత్​ దేశం నిరసనలతో హోరెత్తింది. దాదాపు 25 రాజకీయ పార్టీలు సహా అనేక సంఘాలు భారత్​ బంద్​లో పాల్గొన్నాయి. అన్నదాతలకు మద్దతుగా ఆందోళనలు నిర్వహించాయి. మహారాష్ట్ర, బంగాల్​, ఒడిశాలో రైల్​ రోకో నిర్వహించారు నిరసనకారులు. బంద్ నేపథ్యంలో దిల్లీ సరిహద్దులో బలగాలను భారీగా మోహరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కొత్త లెక్క

ఎవరెస్ట్​ శిఖరం తాజా ఎత్తును సంయుక్తంగా ప్రకటించాయి నేపాల్-చైనా. 8848.86 మీటర్ల ఎత్తు ఉందని వెల్లడించాయి. గత లెక్కలకన్నా ఇది 86 సెంటీమీటర్లు ఎక్కువ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ముంబయి వీధుల్లో రోహిత్​

టీమ్​ఇండియా క్రికెటర్​ రోహిత్​ శర్మ.. ముంబయిలో పర్యాటక ప్రదేశంగా పేరొందిన అలీబాగ్​ ప్రాంతంలో కనిపించాడు. అక్కడ ఆస్తిని కొనుగోలు చేయడానికి వచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఈ సినిమాలదే హవా!

ఈ ఏడాది అత్యధికులు వాడిన సినిమా హ్యాష్​ట్యాగ్​లను ప్రకటించింది ట్విట్టర్. అందులో సుశాంత్ రాజ్​పుత్ నటించిన 'దిల్​ బెచారా' టాప్​లో నిలవగా తర్వాత రెండు స్థానాల్లో సూర్య 'సూరారై పొట్రు', మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details