అర్చకుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎప్పుడూ సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహంకాళి ఆలయ అర్చకులు వేణుమాధవ శర్మ, రామక్రిష్ణ శర్మ... వెస్ట్‌మారేడ్‌పల్లిలోని ఆయన నివాసంలో మంత్రిని సన్మానించారు. వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
అర్చకుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూలమే: తలసాని - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అర్చకుల సన్మానం
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మహంకాళి ఆలయ అర్చకులు సన్మానించారు. పెండింగ్‌లో ఉన్న తమ వేతనాలు ఇప్పించినందుకు... కృతజ్ఞతలు తెలిపారు. అర్చకుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుందని మంత్రి తెలిపారు.
అర్చకుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూలమే: తలసాని
ఇటీవల మంత్రిని కలిసినప్పుడు తమకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విన్నవించారు. స్పందించిన మంత్రి... దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించారు. మంత్రి చొరవతోనే తమకు వేతనాలు మంజూరయ్యాయని అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:మహీంద్రా మెచ్చిన 'ముద్దు' వీడియో ఇది!