తెలంగాణ

telangana

ETV Bharat / city

14 వేల మందితో డిజిటల్ మహానాడు - చంద్రబాబు తాజా వార్తలు

మహానాడు... ఈ పేరు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల్లో నూతనోత్సాహం నింపుతుంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని ఏటా ఘనంగా జరిపే ఈ వేడుకను ఈ సారి ఆన్​లైన్​లో నిర్వహించనున్నారు. ఇందుకనుగుణంగా అధినేత చంద్రబాబు ప్రతి ఒక్కరికీ డిజిటల్ ఆహ్వానాలు పంపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 13 తీర్మానాలను ఈసారి మహానాడులో ఆమోదించనున్నారు.

tdp mahanadu
tdp mahanadu

By

Published : May 26, 2020, 8:51 PM IST

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా... లేకపోయినా ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. మహానాడు రెండో రోజు వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి మాత్రం వర్చువల్‌ మీడియా వేదికగా ఈ కార్యక్రమాన్ని జరపనున్నారు. ఒకేసారి 14 వేల మందితో ఈ సారి మహానాడు ఆన్​లైన్​లో జరగనుంది.

ఈ నెల 27, 28 తేదీల్లో ఆరు గంటల్లో కార్యక్రమం పూర్తి చేసేలా ప్రణాళికలు చేశారు. 27న ఉదయం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యనేతల ప్రసంగాల అనంతరం తీర్మానాలు ప్రవేశపెడతారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా 28న ఆయనకు నివాళులర్పించి, కార్యక్రమం కొనసాగిస్తారు.

ఆన్​లైన్​లో తెలంగాణ నుంచి దాదాపు 1500 మంది, ఎన్​ఆర్​ఐ విభాగం ఇతర దేశాల్లోని ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొంటారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, నాయకులకు చంద్రబాబు డిజిటల్ ఆహ్వానం పంపారు. ప్రతి కార్యకర్తా మొబైల్‌ ఫోన్‌ లేదా ట్యాబ్‌లో జూమ్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పంపిన లింక్‌ను ట్యాప్‌ చేసి స్క్రీన్‌ నేమ్‌ వద్ద పేరు, ‘జీమెయిల్‌’ వద్ద mahanadu@tdp.com అని టైప్‌ చేసి మహానాడులో చేరాలని పిలుపునిచ్చారు.

మొత్తం 13 తీర్మానాలు ఈసారి మహానాడులో ప్రవేశపెట్టనున్నారు. యుగపురుషునికి నివాళి తీర్మానాన్ని రెండు రాష్ట్రాలకు కలిపి చేయనుండగా... ఏపీకి 8, తెలంగాణకు 4 తీర్మానాలు విడివిడిగా చేయనున్నారు. ఇక మహానాడుకు అమరావతి ప్రాంతానికి ప్రత్యేక అనుబంధం ఉందనే చెప్పాలి. మొత్తం 29 సార్లు మహానాడు వేడుకను నిర్వహించగా... నాలుగు పర్యాయాలు అమరావతి వేదికైంది.

ప్రస్తుతం 30వ మహానాడు అమరావతిలోనే జరుగుతుంది. అత్యధిక మహానాడుల నిర్వహణ వేదికగా గండిపేట నిలిచింది. వివిధ కారణాల వల్ల 1985, 89, 91, 95, 96, 97, 2008, 2012, 2019 సంవత్సరాల్లో మహానాడు నిర్వహించలేదు. మొత్తంగా చూస్తే తెలుగుదేశం పార్టీ సభ్యులకు మహానాడు పండుగ లాంటిదని కార్యకర్తలు అంటున్నారు.

ఇదీ చదవండి:రోనా కాలాన్ని స్కిప్ చేసేలా ఉంటే ఎంత బావుండు!

ABOUT THE AUTHOR

...view details