ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్ కాలనీలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పరవాడ మండలం భోనంగి గ్రామానికి చెందిన యువతి, అవినాష్(33) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కావాలనుకున్నారు. రిజిస్టర్ వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.
వివాహ బంధంతో ఒక్కటి కావాలనుకున్నారు.. ఇంతలోనే.. - నగేోకోజోూలోస తోూాేూ లాైే
ఏపీలోని విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇవాళ రిజిస్టర్ వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్న ప్రేమజంట... ఇంతలో అఘాయిత్యానికి పాల్పడ్డారు.
విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్య.. కారణమేంటంటే!
ఈ క్రమంలో గురువారం గాజువాక శ్రీనగర్ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఈ ఉదయం 9గంటల సమయంలో ఇంటి యజమాని వచ్చి తలుపుకొట్టినా ఎంతకూ తెరవకపోవడంతో కిటికీలోంచి చూడగా.. ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. ఈ విషయాన్ని వెంటనే గాజువాక పోలీసులకు సమాచారం అందించారు. సీఐ మల్లేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.