లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములు నియమితులయ్యారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అచ్చనపల్లికి చెందిన జస్టిస్ సీవీ రాములు 1949 ఫిబ్రవరి 20న జన్మించారు. బోధన్, నిజామాబాద్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో డిగ్రీ చదివిన జస్టిస్ రాములు.. ఔరంగాబాద్‌లోని మరట్వాడ యూనివర్సిటీ నుంచి 1978లో ఎల్ఎల్బీ పూర్తి చేశారు.
ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా..
మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది సీ.ఆనంద్ రావు వద్ద జూనియర్‌గా ప్రాక్టీసు ప్రారంభించిన జస్టిస్ రాములు.. సుమారు 24 ఏళ్ల పాటు ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ, కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీలకు స్టాండింగ్ కౌన్సిల్ వ్యవహరించిన ఆయన.. 2002 డిసెంబరు 2న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఉస్మానియూ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా నియమితులైన జస్టిస్ బి.చంద్రయ్య ఆదిలాబాద్ జిల్లా తిమ్మాపూర్‌లో 1954 మే 10న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియూ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేసిన జస్టిస్ చంద్రయ్య 1980 నవంబరు 11న ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదయ్యారు.
సుమారు ఏడేళ్ల పాటు ప్రభుత్వ ప్లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్ చంద్రయ్య.. 2005 మే 26న ఉమ్మడి హైకోర్టుగా నియమితులయ్యారు. జస్టిస్ చంద్రయ్య 2016 మే 9న పదవీ విరమణ చేశారు. లోకాయుక్త జస్టిస్ సీవీ రాములు ఐదేళ్లు... మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
ఇవీచూడండి: హైదరాబాద్‌లో 'పౌర' సెగ: వామపక్ష నేతల అరెస్ట్