తెలంగాణ

telangana

ETV Bharat / city

LOCK DOWN: ఆంక్షలు పొడిగింపు .. ప్రకటనే తరువాయి.. - latest news

కరోనా కట్టడిలో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ అమలవుతున్న విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సడలింపు ఉంది. మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Lockdown more strictly in andhrapradesh
మరింత కఠినంగా లాక్‌డౌన్‌..కరోనా ఉద్ధృతి దృష్ట్యా చర్యలు

By

Published : May 29, 2021, 3:12 PM IST

Updated : May 29, 2021, 7:49 PM IST

కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపు ఉంది. ఈ సమయంలో కూడా 144 సెక్షన్ అమలులో ఉంది. అయితే ఇంకొంతకాలం పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.

చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ ఆంక్షలు మరింత కఠినంగా అమలుచేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం తెలిపారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు సరకుల కొనుగోలుకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. జూన్‌ 1 నుంచి జిల్లాలో ఉదయం 10గంటల తర్వాత కర్ఫ్యూ అమలులోకి వస్తుందని చెప్పారు. చిత్తూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.

చిత్తూరు జిల్లాలో నిన్న ఒక్కరోజే 2291 కొత్త కేసులు, 15 మరణాలు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆ జిల్లాలో 1.85లక్షల మందికి పైగా కొవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో 1.63లక్షల మందికి పైగా కోలుకోగా.. 1254మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,810 క్రియాశీల కేసులు ఉన్నాయి.

ఇదీ చదవండి: వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

Last Updated : May 29, 2021, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details