తెలంగాణ

telangana

ETV Bharat / city

టీకా కోసం వెళ్లే వారు మొదటి డోసు ధ్రువపత్రం చూపించాలి: సీపీ - lock down in hyderabad

హైదరాబాద్​లోని రాచకొండ కమిషనరేట్​ పరిధిలో లాక్​డౌన్​ ప్రశాంతంగా సాగుతోంది. దుకాణాదారులు నిర్ణీత సమయంలోనే తమ వ్యాపారాలను మూసివేసి లాక్​డౌన్ పాటించగా... పలు చోట్ల మాత్రం వాహనాల రాకపోకలు కొనసాగాయి. అత్యవసరం లేకుండా రహదారులపై వస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించారు.

lock down situations in rachakonda commissionerate
lock down situations in rachakonda commissionerate

By

Published : May 12, 2021, 8:09 PM IST

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాల్లో ప్రజలు లాక్​డౌన్​కు పూర్తిగా సహకరిస్తున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా దుకాణాలన్నీ మూసివేసి లాక్​డౌన్ పాటించడం ఎంతో ఆనందం కలిగించిందని పేర్కొన్నారు. ఎల్బీనగర్, కొత్తపేట, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, నేరేడ్​మెట్, కుషాయిగూడ ప్రాంతాల్లో లాక్​డౌన్ అమలు తీరును సీపీ స్వయంగా పరిశీలించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్​డౌన్ మినహాయింపు ఉండటం వల్ల... ఆ సమయంలోనే ప్రజలు బయటికి వచ్చి తమకు కావల్సిన అవసరాలు తీర్చుకోవాలని సూచించారు.

లాక్​డౌన్ సమయంలో బయటికి వస్తే కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. టీకా కోసం వెళ్లే వారు ఆధార్​కార్డు, మొదటి డోసు సర్టిఫికేట్​ లేదా సెల్​ఫోన్​లో మెసేజ్​లను చూపించాలని విజ్ఞప్తి చేశారు. 46 చెక్​పోస్టులు పెట్టి లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలయ్యేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఎవరికైనా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే రాచకొండ కమిషనరేట్ పరిధిలో మూడు ఉచిత అంబులెన్స్​ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

మరోవైపు దుకాణాదారులు నిర్ణీత సమయంలోనే తమ వ్యాపారాలను మూసివేసి లాక్​డౌన్ పాటించగా... పలు చోట్ల రహదారులపై వాహనాలు రాకపోకలు కొనసాగాయి. చిరువ్యాపారులు ఉదయం రెండు గంటలు మాత్రమే అమ్మకాలు నిర్వహించి ఆ తర్వాత దుకాణాలను మూసివేశారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ఆర్టీసీ బస్సులు, వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం 10 గంటల తర్వాత నగరంలో అడుగుపెట్టిన ప్రయాణికులు వాహనాలు దొరకక ఇబ్బందులుపడ్డారు. పలు చోట్ల పోలీసులు వాహనాలను తనిఖీ చేపట్టారు. అత్యవసరం లేకుండా రహదారులపై వస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించారు.

ఇదీ చూడండి: రేపటి నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పులు

ABOUT THE AUTHOR

...view details