రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత రహదారులపైకి వస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో ఉదయం 6 నుంచే కిటికిట మొదలైనా.. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల వరకు వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. అధికారులు.. కూడళ్ల వద్ద అదనపు ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. సడలింపు సమయంలో అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి.