తెలంగాణ

telangana

ETV Bharat / city

Lock Down Effect : కరోనాతో క్యాటరర్స్​కు గడ్డుకాలం - lock down effect on caterers

హంగుహార్భాటాలతో.. అంబరాన్నంటే సంబురంలా చేసుకోవాల్సిన వివాహ వేడుకలు.. పరిమిత బంధువులతో నిరాడంబరంగా చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కరోనా వల్ల వివాహాలు, శుభకార్యాలు చేసే క్యాటరర్స్, ఇతర రంగాల వారు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆదాయం లేక.. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు.

corona effect, corona effect on catering
కరోనా ఎఫెక్ట్, క్యాటరింగ్​పై కరోనా ఎఫెక్ట్

By

Published : Jun 5, 2021, 3:11 PM IST

వివాహాది శుభకార్యాల్లో వడ్డించి మర్యాదలు చేసే క్యాటరర్స్ గడ్డు కాలం ఎదుర్కొంటున్నారు. కొవిడ్ వల్ల సకాలంలో జరగాల్సిన పెళ్లిళ్లు, ఫంక్షన్లు వాయిదా పడుతుండటం వల్ల ఆర్డర్లు లేక అవస్థలు పడుతున్నారు. ఆరునెలలగా ఎటువంటి శుభకార్యాలు లేక, ఆదాయం రాక ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు.

పరిమిత సంఖ్యలో వేడుకలకు హాజరు నిబంధనలు, లాక్​డౌన్ ఆంక్షలు వీరి అవకాశాలను మరింత దిగజారుస్తున్నాయి. క్యాటరింగ్ పైనే ఆధారడిన పార్టటైం క్యాటరింగ్ బాయ్స్ పాకెట్ మనీ కోల్పోయారు. పెళ్ళిళ్లు, పేరంటాలు వాయిదా, రద్దు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోన్న క్యాటరింగ్ నిర్వాహకులతో ఈటీవీ భారత్ ముఖామఖి..

కరోనాతో క్యాటరర్స్​కు గడ్డుకాలం

ABOUT THE AUTHOR

...view details