తెలంగాణ

telangana

ETV Bharat / city

గ్రేటర్​ ఎన్నికల దృష్ట్యా జోరుగా మద్యం విక్రయాలు - Liquor sales latest news

రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జీహెచ్​ఎంసీ ఎన్నికల నేపథ్యంలో విక్రయాలు ఊపందుకున్నాయి. గడిచిన మూడు వారాల్లోనే మందుబాబులు రూ.1708 కోట్ల మద్యాన్ని తాగేశారు. గ్రేటర్​ ఎన్నికల షెడ్యూల్​ విడుదలైన అనంతరం మద్యం విక్రయాలు పెరిగాయని అబ్కారీ శాఖ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కల్లో రంగారెడ్డి జిల్లా ముందువరుసలో నిలిచింది.

liquor sales increased in telangana
గ్రేటర్​ ఎన్నికల దృష్ట్యా జోరుగా మద్యం విక్రయాలు

By

Published : Nov 23, 2020, 2:00 AM IST

గ్రేటర్‌ ఎన్నికల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. నవంబరు నెలలో గడిచిన మూడు వారాల్లో... రూ.1708 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోయింది. మొదటి రెండు వారాలు సగటున రూ.520 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోగా.. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన మూడో వారంలో ఏకంగా రూ.662 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అంటే దాదాపు నూటా నలభై కోట్లు విలువైన మద్యం అంతకు ముందు వారాల కంటే అధికంగా అమ్ముడుపోయింది.

గ్రేటర్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన ఈ నెల 17వ తేదీన రూ.104 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోగా....18వ తేదీన రూ.84 కోట్లు, 19వ తేదీన రూ.90 కోట్లు, 20వ తేదీన రూ.85 కోట్లు, 21వ తేదీన రూ.140 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోయినట్లు అబ్కారీ శాఖ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలో ఈ నెలలో ఇప్పటి వరకు రూ.380 కోట్లు, హైదరాబాద్‌ రూ.190 కోట్లు, మెదక్‌ రూ.132 కోట్లు, మేడ్చల్‌ రూ.55 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. దీన్ని బట్టి చూస్తే... నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి విక్రయాలు క్రమంగా పెరుగుతున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

ఇవీ చూడండి: గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పార్టీల అడుగులు

ABOUT THE AUTHOR

...view details