తెలంగాణ

telangana

ETV Bharat / city

Liquor price in AP : మందుబాబులు ఖుష్.. మద్యం దుకాణాలకు పూజలు

Liquor price in AP : ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడంతో మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆదివారం రోజున ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మద్యం దుకాణాల వద్ద మద్యం ప్రియులు పూజలు నిర్వహించారు.

By

Published : Dec 20, 2021, 10:07 AM IST

ఏపీలో మద్యం ధరలు, liquor cost in AP
ఏపీలో తగ్గిన మద్యం ధరలు

ఏపీలో మందుబాబులు ఖుష్

Liquor price in AP : ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ ధరలు అందుబాటులోకి తేవడంతో పాటు, అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ధరలు తగ్గిస్తూ తీసుకున్న చర్యలతో మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Liquor prices decreased in AP : ఆదివారం రోజున ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మద్యం ప్రియులు ఆనందోత్సాహాలతో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద పూజలు నిర్వహించారు. దుకాణానికి హారతులు ఇచ్చి.. అహో.. ఓహో అంటూ పాటలు పాడారు. ఇది చూసి స్థానికులు నవ్వుకున్నప్పటికీ .. మద్యం ప్రియులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details