తెలంగాణ

telangana

'ఎల్​ఐసీని అమ్మేస్తామంటే ఊరుకోం'

By

Published : Feb 4, 2020, 8:24 PM IST

ఎల్​ఐసీని పబ్లిక్​ ఇష్యూకు పంపిస్తామని బడ్జెట్​లో కేంద్రం ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్​ సైఫాబాద్​లోని సంస్థ జోనల్​ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

LIC EMPLOYEES STRIKE AT CYFABAD
'ఎల్​ఐసీపై కేంద్రం నిర్ణయం సరికాదు'

జీవిత బీమా సంస్థను పబ్లిక్​ ఇష్యూకు పంపిస్తామని బడ్జెట్​లో ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆల్​ ఇండియా ఇన్సూరెన్స్​ ఎంప్లాయిస్​ అసోసియేషన్​, ఎల్​ఐసీ క్లాస్​-1 ఆఫీసర్స్​ యూనియన్​, ఆల్​ ఇండియా ఎల్​ఐసీ ఏజెంట్స్​ అసోసియేషన్​లో సైఫాబాద్​​లోని జోనల్​ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి.

లాభాల్లో పయనిస్తున్న సంస్థపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని వారు తప్పుబట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎల్​ఐసీ వెన్నెముకలాంటిదన్నారు. రూ.32 లక్షల కోట్ల నికర ఆస్తులు కలిగి ఉన్న జీవిత బీమా సంస్థను నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 1.25 మంది ఉద్యోగులు, 11.91 మంది ఏజెంట్లు, 30 కోట్ల మంది పాలసీ హోల్డర్స్​ అందరూ ఈ చర్యలను తిప్పకొట్టాలని కోరారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దిల్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు.

'ఎల్​ఐసీపై కేంద్రం నిర్ణయం సరికాదు'

ఇవీచూడండి:'డిపాజిటర్ల సొమ్ము భద్రం- బీమా కవరేజీ 5 లక్షలకు పెంపు'

ABOUT THE AUTHOR

...view details