గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ప్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కారు ప్రమాద ఘటనకు గల కారణాలను అధ్యయనం చేసి పది రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని లీ అసోసియేట్స్ కమిటీ సభ్యుడు నాగభూషణం పేర్కొన్నారు.
బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ సందర్శించిన నిపుణుల కమిటీ
హైదరాబాద్ గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ కారు ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన "లీ అసోసియేట్స్ కమిటీ"సభ్యులు సందర్శించారు. దాదాపు గంట పాటు కమిటీ సభ్యులు ఫ్లై ఓవర్‌ను ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదానికి అతి వేగమా, డిజైన్ తప్పిదమా అనే దానిపై అధ్యయనం చేసి నివేదిక అందిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.
బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ సందర్శించిన లీ అసోసియేట్స్ కమిటీ
అతి వేగమా... లేక డిజైన్ తప్పిదామా..?
రోడ్డు ప్రమాద ఘటనకు దారితీసిన అంశాన్ని సభ్యులు పర్యవేక్షించారు. దాదాపు గంట పాటు కమిటీ సభ్యులు ఫ్లై ఓవర్‌ను ఘటన జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కమిటీ సభ్యులు కారులో ఫ్లై ఓవర్ పై ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి మూడు సార్లు డ్రైవ్ చేసి పరిశీలించారు. ప్రమాదానికి ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణా లోపమా లేక డిజైన్ తప్పిదామా, అతి వేగమా అనే అంశాలపై అధ్యయనం చేసి నివేదిక అందిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.