BJP National Working Committee Meetings: వచ్చేనెల హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను భాజపా అధిష్ఠానం ముమ్మరం చేసింది. జులై 2, 3 తేదీల్లో... సమావేశాలు జరగనున్న నోవాటెల్‌లో ఏర్పాట్లను భాజపా రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జి తరుణ్‌చుగ్, పార్టీ సీనియర్ నేత శివప్రకాశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా.. పలువురు నేతలు పరిశీలించారు. అక్కడి సదుపాయాల గురించి ఆరా తీశారు. సభా వేదిక, భోజన వసతి, పార్కింగ్, ఫొటో ఎగ్జిబిషన్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశాలపై నేతలు చర్చించారు.
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు.. నోవాటెల్‌లో పకడ్బందీ ఏర్పాట్లు - భాజపా రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జి తరుణ్‌చుగ్
BJP National Working Committee Meetings : హైదరాబాద్ వేదికగా జులైలో నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను భాజపా అధిష్ఠానం ముమ్మరం చేసింది. సమావేశాలను విజయవంతం చేసేందుకు కమలనాథులు.. పార్టీ నేతలతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. సమావేశాలు జరగనున్న నోవాటెల్‌లో ఏర్పాట్లను భాజపా రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జి తరుణ్‌చుగ్, పార్టీ సీనియర్ నేత శివప్రకాశ్, బండి సంజయ్ సహా.. పలువురు నేతలు పరిశీలించారు.
హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా జులై 2 సాయంత్రం 4గంటల నుంచి మూడో తేదీ సాయంత్రం 5గం. వరకు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేశామా లేదా అని సమీక్షించుకోవడంతో పాటు పలు అంశాలపై కమలనాథులు తీర్మానాలు చేయనున్నారు. పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనా భాజపా నేతలు చర్చించనున్నారు.
ఇవీ చదవండి: