లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు వలస కార్మికులు, కరోనా బాధితులకు హైదరాబాద్, ఎల్బీనగర్ ట్రాఫిక్ సీఐ నాగమల్లు అండగా నిలిచారు. డివిజన్ పరిధిలోని మోహన్ నగర్‌కు చెందిన ఓం ప్రకాష్ సహకారంతో నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
వలస కార్మికులకు అండగా నిలిచిన ట్రాఫిక్ సీఐ - essentials to corona victims
కొవిడ్ కష్టకాలంలో మానవతావాదులు స్పందిస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేదలకు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్, ఎల్బీనగర్ ట్రాఫిక్ సీఐ.. నిరుపేదలకు నిత్యావసరాలను అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు.
help to migrant workers
కష్టకాలంలో మానవతవాదులంతా ముందుకొచ్చి సేవా కార్యక్రమాలను చేపట్టాలని నాగమల్లు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉంటూ.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలను కోరారు.
ఇదీ చదవండి:KTR : 'రూ.500 కోట్లతో అన్ని మున్సిపాలిటీల్లో మార్కెట్లు'