తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 3PM - Latest Telangana news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు...

Latest news in Telugu
Latest news in Telugu

By

Published : May 30, 2021, 3:00 PM IST

1. రాష్ట్ర కేబినెట్​ భేటీ..

ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. లాక్‌డౌన్ అంశంతో పాటు కరోనా కట్టడి చర్యలపై కేబినెట్​ చర్చించనుంది. రాష్ట్రంలో విధించిన లాక్​డౌన్​ నేటితో ముగియనున్న దృష్ట్యా.. వారం, పది రోజులు లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సడలింపు సమయాన్ని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. యాంటీ వైరల్‌ ఆహారం తిందామా..

ప్రస్తుతం కొవిడ్ మానవులకు ముప్పుగా మారింది. మన రోగ నిరోధక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకునేందుకు బలవర్ధకమైన ఆహారం తీసుకోక తప్పదు. వైరస్​ బారినుంచి తప్పించుకోవాలంటే ముఖ్యంగా యాంటీ వైరల్‌ గుణాలున్న కొన్ని రకాల ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటో ఒక్కసారి పరిశీలిద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. కరోనాకు తల్లీబిడ్డ బలి..

కరోనాతో ఒక రోజు వ్యవధిలోనే శిశువు, బాలింత మృతిచెందిన ఘటన మహబూబాబాద్​ జిల్లాలో జరిగింది. ప్రసవం కోసం కన్నవారి ఇంటికి వచ్చిన సరిత.. మృత్యువాత పడడం వల్ల గూడూరు మండలం దామరవంచలో విషాద ఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. శశికళ రీ ఎంట్రీ...

క్రియాశీల రాజకీయాల్లోకి శశికళ మళ్లీ అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. పార్టీ సమస్యలను చక్కదిద్దేందుకు త్వరలోనే వస్తానని పార్టీ కార్యకర్తలకు శశికళ అభయమిచ్చారు. కరోనా మహమ్మారి ముగిసిన వెంటనే పార్టీ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. కల్తీ మద్యానికి 55 మంది బలి

ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 55కు చేరినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 17 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు.. తాము ఇప్పటివరకు 51 మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించామని అలీగఢ్​ జిల్లా ప్రధాన వైద్యాధికారి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. 12 ఏళ్ల కశ్మీర్​ బాలిక రికార్డు..

జమ్ముకశ్మీర్​కు చెందిన జైనాబ్​ మసూమా అనే 12 ఏళ్ల బాలిక.. టోఫెల్​ పరీక్షలో 120కి 115 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన వయసు వారెవ్వరూ సాధించని ఘనతను జైనాబ్​ సొంతం చేసుకుంది. సాధారణంగా ఈ పరీక్ష విశ్వవిద్యాలయ స్థాయి వారికే కఠినంగా ఉంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. వారి నుంచి వైరస్ రాదా?

వ్యాక్సినేషన్ పూర్తైనవారు మాస్కు, భౌతిక దూరం నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని అమెరికా సీడీసీ ఇటీవల స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టీకా తీసుకున్న వారికి కొవిడ్ సోకితే వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించదా అన్న సందేహం మొదలైంది. మాస్కులు, ఇతర నిబంధనలను పూర్తిగా విస్మరించడం సబబేనా? దీనిపై నిపుణులేమంటున్నారు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. గూగుల్​, ఫేస్​బుక్​ అప్​డేట్​..

నూతన ఐటీ రూల్స్​ను(New IT rules) ప్రతిబింబించేలా గూగుల్​, ఫేస్​బుక్ వంటి టెక్​ దిగ్గజాలు చర్యలు ప్రారంభించాయి. కొత్త నిబంధనలను అనుసరించి.. గ్రీవెన్స్​, నోడల్ అధికారుల నియామక సమాచారాన్ని తమ వెబ్​సైట్లలో పొందుపరుస్తున్నాయి. ట్విట్టర్(Twitter) మాత్రం ఇంకా నూతన నిబంధనలను అమలు చేయడం లేదని తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. సీపీఎల్ షెడ్యూల్లో మార్పు!

కరేబియన్​ ప్రీమియర్​ లీగ్​ను​ రీషెడ్యూల్​ కోసం బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వెస్టిండీస్​ బోర్డుతో చర్చలు జరుపుతోంది. సీపీఎల్​ షెడ్యూల్​ ప్రకారం జరిగితే అందులో పాల్గొనే ఆటగాళ్లు.. ఐపీఎల్​​​ రెండో దశ ప్రారంభ మ్యాచ్​లకు దూరమయ్యే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. విజయ్​ తొలి తెలుగు సినిమా...

తళపతి విజయ్ తొలి తెలుగు సినిమా ఖరారైంది. తన దర్శకత్వంలో నటిస్తున్నట్లు వంశీ పైడిపల్లి వెల్లడించారు. లాక్​డౌన్ తర్వాత పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details