Chetana Foundation: చేతన ఫౌండేషన్ ఛైర్మన్ రవి 8 దేశాలలో సంస్థ సేవలను కొనసాగించడం సంతోషంగా ఉందని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన నివాసంలో సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కోనేరు కోనప్పతో కలిసి 20 మంది పేద విద్యార్థులకు చేతన ఫౌండేషన్ ప్రతినిధులు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు.పేద విద్యార్థులకు చదువుల్లో చేయుతనివ్వాలనే సంకల్పంతో చేతన ఫౌండేషన్ ల్యాప్టాప్లు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.
Chetana Foundation: పేద విద్యార్థులకు చేతన ఫౌండేషన్ చేయూత - కోనేరు కోనప్ప తాజా వార్తలు
Chetana Foundation: పేద విద్యార్థులను ఎంపిక చేసి సాంకేతిక నైపుణ్యాన్ని మెరుగు పర్చేందుకు... చేతన ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ఈ కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే నివాసంలో ల్యాప్టాప్లను అందజేశారు.
Chetana Foundation
విపత్కర కొవిడ్ సమయంలోనూ పేద విద్యార్థులను ఎంపిక చేసి వారిలో ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే వెయ్యి ల్యాప్టాప్లు విద్యార్థులకు అందజేశారని ఎమ్మెల్యేలు తెలిపారు. వారి సహాయ సేవలు ప్రశంసనీయమని శాసనసభ్యులు కొనియాడారు. నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందజేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.
ఇదీ చదవండి:Harish Rao Review: 'వైద్యులు ఉ.9 నుంచి సా.4 వరకు అందుబాటులో ఉండాలి'