తెలంగాణ

telangana

ETV Bharat / city

మూడోసారి అధికారం చేపట్టేలా వ్యూహాలుంటాయి: కేటీఆర్​ - కేటీఆర్ వార్తలు

KTR on TRS Plenary: హైదరాబాద్​ హెచ్​ఐసీసీలో రేపు జరగనున్న తెరాస ప్లీనరీ ఏర్పాట్లను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పరిశీలించారు. జనరల్ బాడీ మీటింగ్‌కు 3 వేల మంది తెరాస పార్టీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించినట్లు తెలిపారు. ప్లీనరీలో 11 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

KTR on TRS Plenary
KTR on TRS Plenary

By

Published : Apr 26, 2022, 7:28 PM IST

KTR on TRS Plenary: సామాన్య, మధ్యతరగతి ఆంకాంక్ష ప్రతిబింభించేలా తెరాస ప్లీనరీ ఉంటుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం 11 తీర్మానాలు రూపొందించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పోతుందో స్పష్టంగా చెబుతామని అన్నారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తామని వెల్లడించారు. కేసీఆర్​ తిరిగి హ్యాట్రిక్​ కొట్టి మూడోసారి పరిపాలన పగ్గాలు చేపట్టాలనే గులాబీ శ్రేణుల ఆకాంక్షకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించుకుంటామని పేర్కొన్నారు. రేపు హెచ్​ఐసీసీలో జరిగే తెరాస ప్లీనరీ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు.

తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన బుధవారం హెచ్​ఐసీసీలో రాష్ట్ర ప్రతినిధుల మహాసభ జరగనుంది. ఉదయం పది గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గం, రాజ్యసభ, లోక్‌సభల సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా మొత్తం మూడు వేలమందికి ఆహ్వానం పంపించారు. పురుషులు గులాబీరంగు దుస్తులు, మహిళలు అదే రంగు చీరలతో హాజరు కావాలని పార్టీ అధిష్ఠానం నిర్దేశించింది. ఉదయం 10 గంటల వరకు ప్రతినిధుల నమోదు... 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పతాకావిష్కరణ చేస్తారు. తర్వాత తెలంగాణ తల్లికి, అమరవీరులకు నివాళి అర్పించి... అనంతరం స్వాగతోపన్యాసం ఉంటుంది.

మూడోసారి అధికారం చేపట్టేలా వ్యూహాలుంటాయి : కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details