తెలంగాణ

telangana

ETV Bharat / city

KTR Comments: 'భాజపా అదే కోరుకుంటోంది!'.. లక్ష్మణ్​ వ్యాఖ్యలపై కేటీఆర్​ ట్వీట్​.. - భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్

KTR Comments: భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మంత్రి కేటీఆర్​ ట్వీట్​ చేశారు. యూపీ తరహా పాలనను అనుసరించాలన్న లక్ష్మణ్​ కామెంట్​ను పెద్ద జోక్​గా అభివర్ణించారు.

KTR tweet on Laxman's comments on CM KCR
KTR tweet on Laxman's comments on CM KCR

By

Published : Feb 26, 2022, 5:12 AM IST

KTR Comments: ఉత్తరప్రదేశ్ తరహా పాలనను ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించాలన్న భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభివర్ణించారు. దేశమంతా తెలంగాణ కార్యక్రమాల బదులుగా యూపీ తరహా పాలనను కేసీఆర్ అనుసరించాలన్న లక్ష్మణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

యూపీలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక పిల్లలు చనిపోయారని.. అధికారంలో ఉన్న వ్యక్తులు రైతులను తొక్కి చంపారని.. విద్యుత్ కోతలు, అపరిశుభ్రతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. అలాంటివి తెలంగాణలోనూ చేయాలని భాజపా కోరుకుంటుందని కేటీఆర్ ఆరోపించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details