కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. వివిధ దేశాల్లో ఉన్న వాళ్లంతా స్వదేశాలకు తిరిగి వచ్చేలా ఆయా దేశాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో మనీలా, రోమ్, సింగపూర్, కౌలాలాంపూర విమానాశ్రయాల్లో ఎంతో మంది భారతీయులు చిక్కుకున్నారు. కనీస వసతులు లేక బిక్కుబిక్కుమంటూ రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. వాళ్లంతా సామాజిక మాధ్యమాల ద్వారా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
మోదీ జీ... వారిని త్వరగా స్వస్థలాలకు రప్పించండి : కేటీఆర్
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. వారిని సురక్షితంగా ఇళ్లకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
మోదీ జీ... వారిని త్వరగా స్వస్థలాలకు పంపించండి : కేటీఆర్
స్పందించిన రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్... విమానాశ్రయాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేలా ఏర్పాట్లు చేయాలని ప్రధాని మోదీని ట్విటర్ ద్వారా కోరారు. వారి నుంచి వస్తున్న సందేశాలు చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా విదేశాల్లో ఉన్న భారతీయులను స్వస్థలాలకు పంపించేలా ఏర్పాటు చేయాలని ప్రధానికి మంత్రి కేటీఆర్ విన్నవించారు.