హైదరాబాద్ సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన ఘటనతో తను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నేరస్తుడిని గంటల వ్యవధిలో పట్టుకున్నారని చెప్పారు. బాధిత కుటుంబానికి త్వరగా న్యాయం చేయాలని హోం మంత్రి, డీజీపీని కోరారు.
KTR: చిన్నారిపై హత్యాచారం కలిచివేసింది... ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం
సైదాబాద్‌లో జరిగిన ఘటన తనను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి త్వరగా న్యాయం చేయాలని హోం మంత్రి, డీజీపీని కోరారు.
హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో ఓ యువకుడు ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురుకు చెందిన రాజుకు వివాహమైంది. ఆరు నెలలుగా సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన రాజు వేధింపులు తట్టుకోలేక.. భార్య అతడిని వదిలి వెళ్లిపోయింది. కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న రాజు... చిల్లర దొంగతనాలు కూడా చేశాడు. 9వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి గదిలోకి తీసుకెళ్లిన రాజు.... హత్యాచారం చేశాడు. ఆపై గొంతు నులిచి చంపేశాడు. చిన్నారి మృతదేహాన్ని పరుపులో చుట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేద్దామని నిందితుడు భావించినప్పటికీ... వీలు కాకపోవడంతో గదిలో పెట్టి తాళం వేసి వెళ్లినట్టు పోలీసులు నిర్ధరించారు.
ఇదీ చదవండి:Rape On Child: అందరు అనుమానించిందే నిజమైంది.. చిన్నారిని వాడే చిదిమేశాడు..