తెలంగాణ

telangana

ETV Bharat / city

KTR on Karnataka Government : 'కర్ణాటక సర్కార్‌ హింసను అదుపు చేయలేకపోతోంది' - కర్ణాటక ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

KTR on Karnataka Government : హింస ఏ రూపంలో ఉన్నా తాము సహించమని, తప్పక ఖండిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కర్ణాటకలో భాజపా సారథ్యంలో అసమర్థ ప్రభుత్వం ఉన్నందునే.. అక్కడ మతపరమైన హింసను అదుపు చేయలేకపోతోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

KTR on Karnataka Government
KTR on Karnataka Government

By

Published : Feb 23, 2022, 8:29 AM IST

KTR on Karnataka Government : కర్ణాటకలో భాజపా సారథ్యంలో అసమర్థ ప్రభుత్వం ఉన్నందునే మతపరమైన హింసను అదుపు చేయలేకపోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో విమర్శించారు. ఏ రూపంలో ఉన్నా మతపరమైన హింసను తాము ఖండిస్తామన్నారు. ఒక నెటిజన్‌ ట్విటర్‌లో వేసిన ప్రశ్నపై మంత్రి ట్వీట్‌ చేశారు. నిందితులపై చర్యలు తీసుకుంటారని, బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details