తెలంగాణ

telangana

ETV Bharat / city

చెన్నై తాగునీటి కోసం 7 టీఎంసీలు ఇవ్వండి: తమిళనాడు - krishna water to chennai

krishna-water-board meeting in hyderabad to discuss chennai water supply
జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం

By

Published : Feb 5, 2020, 11:27 AM IST

Updated : Feb 5, 2020, 10:39 PM IST

11:26 February 05

జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం

  చెన్నై తాగునీటి అవసరాల కోసం తమకు రావాల్సిన ఏడు టీఎంసీల నీటిని వదలాలని తమిళనాడు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు కోరారు. చెన్నై తాగునీటి అంశంపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. బోర్డు ఇంఛార్జీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఇంజినీర్లు పాల్గొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదు.  

తమకు ఈ ఏడాది ఇప్పటి వరకు 5.2 టీఎంసీల నీరు చేరిందని తమిళనాడు ఇంజినీర్లు తెలిపారు. 15 టీఎంసీల నీటిలో ఆవిరి నష్టాలు పోను 12 టీఎంసీల నీరు రావాల్సి ఉందని చెప్పారు. ఇంకా ఏడు టీఎంసీల వరకు నీరు అందాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం శ్రీశైలం, కండలేరులో నీరు ఉన్నందున తమకు రావాల్సిన నీటిని ఇవ్వాలని తమిళనాడు ఇంజినీర్లు కోరారు. ఈ విషయాన్ని తాము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఏపీ ఇంజినీర్లు తెలిపారు.

ఇవీ చూడండి:కృష్ణానదిలో తెలంగాణ వాటాను కాపాడుకోవాలి: కోదండరాం

Last Updated : Feb 5, 2020, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details