హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశమైంది. కృష్ణాబోర్డు సభ్యుడు ఆర్.కె.పిళ్లై కన్వీనర్‌గా ఉపసంఘం చర్చలు జరుపుతోంది. ప్రాజెక్టుల నిర్వహణ వివరాలు ఇవ్వాలని రెండు రాష్ట్రాలను కేఆర్ఎంబీ కోరింది. 10 రోజుల్లోగా వివరాలివ్వాలని స్పష్టం చేసింది. రూ.కోటికిపైగా విలువ ఉన్న కాంట్రాక్టుల వివరాలు సమర్పించాలని పేర్కొంది. అన్ని అంశాలు పూర్తయ్యాక సీఆర్పీఎఫ్‌పై చర్చ ఉంటుందని వెల్లడించింది. బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ బోర్డు పరిధిలోకి రాదని ఏపీ వాదించింది. బనకచర్ల కూడా బోర్డు పరిధిలోనే ఉండాలని తెలంగాణ స్పష్టంచ చేసింది. ఈ విషయంపై అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని ఉప సంఘం కన్వీనర్ పిళ్లై తెలిపారు.
KRMB: 10 రోజుల్లోగా ప్రాజెక్టుల నిర్వహణ వివరాలు ఇవ్వాలి : కేఆర్ఎంబీ - హైదరాబాద్ వార్తలు
13:20 September 17
కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం
గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ ఖరారుపై ఉపసంఘం చర్చలు జరుపుతోంది. సమావేశంలో తెలంగాణ, ఏపీ అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు... రెండు రాష్ట్రాల జెన్‌కో అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్యులు సైతం పాల్గొన్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ, రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన సమాచారం, వివరాలు, సంబంధిత అంశాలపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్యులు ఉదయమే సమావేశం నిర్వహించారు. అనంతరం కేఆర్ఎంబీతో సమావేశంలో పాల్గొన్నారు.
గతంలో జరిగిన బోర్డుల సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సమన్వయ కమిటీ స్థానంలో ఉప సంఘాలు ఏర్పాటయ్యాయి. ఈ ఉప సంఘాల మొదటి సమావేశం ఇవాళ హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగింది. గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ, రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన సమాచారం, వివరాలు, సంబంధిత అంశాలపై ఉపసంఘం సభ్యులు చర్చిస్తున్నారు.
ఇదీ చూడండి:GRMB meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం ప్రారంభం