తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ ఫిర్యాదుపై తెలంగాణ నీటిపారుదలశాఖకు కృష్ణా బోర్డు లేఖ - telangana irrigation latest news

krishna-river-board
krishna-river-board

By

Published : May 19, 2020, 8:04 PM IST

Updated : May 20, 2020, 12:05 PM IST

19:59 May 19

ఏపీ ఫిర్యాదుపై తెలంగాణ నీటిపారుదలశాఖకు కృష్ణా బోర్డు లేఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నీటిపారుదల ప్రాజెక్టుల సవివర ప్రాజెక్టు నివేదికలు ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఏపీ ఫిర్యాదుపై స్పందించిన బోర్డు... ఈ మేరకు తెలంగాణ వివరణ కోరింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ అనుమతితో బోర్డు సభ్యుడు హరికేష్ మీనా తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్​కు లేఖ రాశారు.  

అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా విభజన చట్టంలోని అంశాలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలతో పాటు మిషన్ భగీరథ పథకాలను చేపట్టిందని... కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని కూడా పెంచాలని ఏపీ తన ఫిర్యాదులో పేర్కొంది.  

గతంలో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ విషయమై 2019 అక్టోబర్ 16వ తేదీ నాటి లేఖలో వివరాలు కోరినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని బోర్డు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా ఫిర్యాదులో ప్రస్తావించిన ప్రాజెక్టుల సవివర నివేదికలు, వివరాలను అందించాలని కోరింది. ఈ అంశాన్ని ప్రాధాన్యకరంగా పరిగణించాలని సూచించింది. 

Last Updated : May 20, 2020, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details