పంజాగుట్ట పోలీసుల కస్టడీలో కోగంటి సత్యం
ప్రముఖ స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రధాన నిందితుడు కోగంటి సత్యంను పంజాగుట్ట పోలీసులు చంచల్గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు.
స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు కోగంటి సత్యాన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జులై 6న రాంప్రసాద్ హైదరాబాద్ పంజాగుట్టలో హత్యకు గురయ్యాడు. కేసు దర్యాప్తులో కోగంటి సత్యంతో పాటు మరో 8 మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. చంచల్గూడ జైలులో ఉంచి వీరిని లోతుగా విచారించేందుకు పంజాగుట్ట పోలీసులు కస్టడీ కోరగా న్యాయస్థానం అనుమతించింది. నిందితులను ఈరోజు చంచల్గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండ్రోజుల పాటు పంజాగుట్ట పోలీసులు వీరిని విచారించనున్నారు.
- ఇదీ చూడండి : ఆర్థిక అభివృద్ధే కాదు... మానవసంబంధాలూ పరిపుష్టం