తెలంగాణ

telangana

ETV Bharat / city

App for Mirchi Drip Irrigation: 'మిర్చి మిత్ర'తో.. సాగులో లాభాల యాత్ర - కేఎల్ యూనివర్సిటీ మిర్చిమిత్ర

App for Mirchi Drip Irrigation: ఆ రైతుల్లో కొందరికి స్మార్ట్‌ఫోన్‌ ఎలా వినియోగించాలో తెలియదు..! కానీ మిర్చి మిత్ర యాప్‌తో వినూత్న సాగు చేస్తున్నారు..! గుత్తికొండలో రైతులకు ప్రయోగాత్మకంగా కేఎల్ వర్సిటీ చేయూతనిస్తోంది..! తొలి ఏడాదే లాభాల పంట పండిస్తున్నారు...! ఇంతకీ ఆ సాగు ఎలా చేస్తున్నారు..? వర్సిటీ వ్యవసాయం చేయించడం ఏంటనుకుంటున్నారా...? అయితే... ఈ కథనం పూర్తిగా చూడాల్సిందే...

App for Mirchi Drip Irrigation: 'మిర్చి మిత్ర'తో.. సాగులో లాభాల యాత్ర
App for Mirchi Drip Irrigation: 'మిర్చి మిత్ర'తో.. సాగులో లాభాల యాత్ర

By

Published : Feb 13, 2022, 10:43 PM IST

'మిర్చి మిత్ర'తో.. సాగులో లాభాల యాత్ర

App for Mirchi Drip Irrigation: విద్యార్థులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రాజెక్టు నివేదిక సమర్పిస్తే..కేఎల్ యూనివర్సిటీ 40 క్రెడిట్‌ పాయింట్లు కేటాయిస్తుంది. అందులో భాగంగా ఏపీలోని గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మిర్చి సాగుకు నీటి కొరత ఉందని సీఎస్సీ విద్యార్థులు గుర్తించారు. నీటి నిర్వహణ పద్ధతులు తెలియక రైతులు నష్టపోతున్నారని తేల్చారు. ఈ విషయాన్ని కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం దృష్టికి తీసుకురాగా.. సెన్సార్‌ పరికరాలతో నీటి వృథాకు అడ్డుకట్ట వేయొచ్చని అధ్యాపకులు సూచించారు. పరిమిత నీటితో మిర్చిని బిందు సేద్యం పద్ధతుల్లో సాగు చేసుకుంటే.. నీటి సమస్యే ఉత్పన్నం కాదని... వర్సిటీ అగ్రికల్చర్‌ విభాగం తెలిపింది.

ఇదీ చదవండి :పట్టులా మెరిసే వీరి స్నేహం.. మతసామరస్యానికి చిహ్నం!

జిల్లాలో ఏడాదికి సగటున 13 వందల మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. పల్నాడులో సరాసరి 700 మిల్లీమీటర్లే ఉంటోంది. ఇలా ఉంటే చిన్న, సన్నకారు రైతులకు ఉపాధి దొరకటం కష్టమే. ఈ ప్రాంతంలో పరిమిత నీటితో వ్యవసాయం చేయటానికి.. బిందు, సెన్సార్‌ పరిజ్ఞానం వినియోగం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని నిపుణులు తెలిపారు.

రైతుల్ని ఒక సమూహంగా ఏర్పాటు చేసి..

ఇలాంటి పరిస్థితుల్లో రైతుల్ని ఒక సమూహంగా ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సహకార సాగు చేయిస్తామని అధ్యాపకులు నివేదికలో ప్రస్తావించడం.. దిల్లీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(డీఎస్టీ)ని ఆకర్షించింది. ఈ సాగుకు ఎస్సీ వర్గానికి చెందిన చిన్న రైతులను ఎంపిక చేసేందుకు మొగ్గుచూపారు. తర్వాత గతేడాది జనవరిలో ప్రాజెక్టు మంజూరు చేసిన డీఎస్టీ కోటీ 3 లక్షలు కేటాయించింది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండలో బోరు సదుపాయమున్న 48 మంది ఎస్సీ రైతులను ఎంపిక చేసి... 24 ఎకరాల్లో వినూత్న సాగు ప్రారంభించారు. ఒక్కో లబ్ధిదారుడికి చెందిన అర ఎకరంలో సాగుకు మాత్రమే సహకారం అందిస్తున్నట్లు వివరించారు.

మిర్చిమిత్ర యాప్​తో..

ఈ సాగుకు మిర్చిమిత్ర అనే యాప్‌ తయారుచేసిన వర్సిటీ.. భూమిలో తేమ ఆరిపోయినా.. పొలంలో నీళ్లు నిండినా... రైతులకు తెలిసేలా గుర్తించే ఏర్పాట్లు చేసింది. నీరు వృథా కాకుండా సెన్సార్లూ ఏర్పాటు చేసింది. చీడ నివారణకు వినియోగించాల్సిన మందులనూ సమకూర్చారు. సేద్యానికి అనువుగా తొలుత భూపరీక్షలు చేయించి.. బోర్లు కలిగిన రైతులను మాత్రమే ఎంపిక చేశారు.

ఇదీ చదవండి :ఇంటి మిద్దెపై ద్రాక్ష​ తోట.. ఆ రైతు చేసిన అద్భుతం

ఈ సారి మిర్చి పంటకు దేశవ్యాప్తంగా తెగుళ్లతో నష్టాలు ఎదురైనా... తమకు మంచి దిగుబడులు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. గుత్తికొండ ఫలితాల తర్వాత జూలకల్లు, కరాలపాడు, జానపాడుకు చెందిన 52 మంది రైతులతో... సహకార సేద్యం చేయిస్తామని కేఎల్ వర్శిటీ కంప్యూటర్‌ సైన్స్ విభాగం ప్రధానాచార్యుడు సుబ్రహ్మణ్యం వివరించారు.

సమస్యకు కారణం తెలుసుకుని..

" సమస్యకు మూలకారణం ఏంటో తెలుసుకుని, అధ్యాపకులచే పరిశోధనలు జరిపి పరిష్కరించేందుకు సాంకేతికతను ఉపయోగించడం జరిగింది. ఈ సాంకేతిక పరిష్కారాన్ని అమలు చేసేందుకు అవసరమైన పరిశోధనా గ్రాంట్ల కోసం అధ్యాపకులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలకు ప్రాజెక్టు రిపోర్టులు పంపుతారు. వారు గ్రాంటు ఇచ్చిన తర్వాత గ్రామాల్లో అమలు చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. "

-సుబ్రహ్మణ్యం, ప్రధానాచార్యుడు, కేఎల్‌యూ కంప్యూటర్‌ సైన్స్ విభాగం

వర్సిటీ తరపున... ముగ్గురు టెక్నికల్‌ ఉద్యోగులను నియమించి రైతులకు క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉంచి... వారికి అన్ని రకాలుగా శిక్షణ ఇప్పిస్తున్నారు. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో అక్కడే ఉంటున్నారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details