తెలంగాణ

telangana

ETV Bharat / city

హైటెక్​ సిటీ రోడ్లు చూపించి అభివృద్ధి చేశామంటే?

హైదరాబాద్​ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్న రాష్ట్ర ప్రభుత్వం మాటలకే పరిమితమయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు. హైటెక్​సిటీ రోడ్లు చూపించి అభివృద్ధి చేశామంటున్నారని, బస్తీ వాసుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

హైటెక్​ సిటీ రోడ్లు చూపించి అభివృద్ధి చేశామంటే?

By

Published : Aug 17, 2019, 12:47 PM IST

గతంలో భాగ్యనగరం బహు సుందరంగా ఉండేదని ఇప్పుడంతా సమస్యలతో సతమతమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. నగరంలో నీటి సమస్యలు, ట్రాఫిక్​ కష్టాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని చాచా నెహ్రూ నగర్ బండ మైసమ్మ నగర్​లో పర్యటించారు. ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. నల్ల పోచమ్మ దేవాలయం ఎదుట మొక్కలు నాటి, మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పలువురు మహిళలు కిషన్ రెడ్డికి రాఖీ కట్టారు. నగరవాసుల సమస్యలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తమ సహకారాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.

హైటెక్​ సిటీ రోడ్లు చూపించి అభివృద్ధి చేశామంటే?

ABOUT THE AUTHOR

...view details