King Cobra Hulchul: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ముండ్ల గ్రామంలో సుమారు 12 అడుగుల కింగ్ కోబ్రా జనవాసాల్లోకి వచ్చింది. కొంతసేపు పాము హల్ చల్ చేసింది. గ్రామానికి చెందిన దుర్యోధన చౌదరి ఇంట్లో కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. దానిని చూసి కుటుంబసభ్యులు భయంతో బయటికి పరుగులు తీశారు. గ్రామస్థులంతా చుట్టుముట్టడంతో కోబ్రా ఇంట్లోనే ఉండిపోయింది. దీంతో వారు సోంపేటకు చెందిన స్నేక్ క్యాచర్కి ఫోన్ చేసి పిలిపించారు. ఆ వ్యక్తి వచ్చి భారీ కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నాడు. పట్టుబడిన పామును అటవీ శాఖ అధికారుల సమక్షంలో అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
King Cobra Hulchul: వామ్మో! ఇంట్లో కింగ్ కోబ్రా.. - ఏపీ తాజా వార్తలు
King Cobra Hulchul: ఈ రోజుల్లో వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఆ ఇంటికి అనుకొని అతిథి వచ్చింది. దర్జాగా ఇంట్లో తిష్టవేసింది. చుట్టు పక్కల వారిని భయపెట్టింది. ఇంతకి ఆ అనుకోని అతిథి ఎవరంటే?
కింగ్ కోబ్రా