తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​ వయా విజయవాడ... భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత - khaini packets worth 18 laks seized

ఏపీలో విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో రూ.18 లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయనగరం జిల్లా తరలిస్తుండగా టాస్క్​ఫోర్స్​ అధికారులు గుర్తించారు. ఆరుగురిని అరెస్టు చేసి లారీని స్వాధీనం చేసుకున్నారు.

khainni-packets-caught-at-vijayawada
విజయవాడలో భారీగా ఖైనీ ప్యాకెట్ల పట్టివేత

By

Published : Jul 9, 2020, 10:45 PM IST

ఆంధ్రప్రదేశ్​లో విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో పెద్ద మొత్తంలో ఖైనీ ప్యాకెట్లు పట్టుకున్నారు. రూ.18 లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్లు, రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయనగరం జిల్లాకు తరలిస్తుండగా విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేసి లారీని స్వాధీనం చేసుకున్నారు.

సీపీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్​ ఏడీసీపీ కేవీ.మోహనరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేశారు. ఒడిశా రాయగడకు చెందిన ఇనుకోలు రవికుమార్‌ ఈ సరకును హైదరాబాద్‌ నుంచి తెప్పించుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనితోపాటు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఏలూరుకి చెందిన సతీశ్, జీఎస్‌టీ బిల్లుపై లావాదేవీలు పర్యవేక్షించే విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన ద్వారపూడి స్వామినాయుడు, లారీ డ్రైవర్లు కృష్ణ, కిరణ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

ఇవీ చూడండి: తెలంగాణలో కొత్తగా 1410 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details