కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన రైతుల దగ్గర నాలుగేళ్ల క్రితం ఎస్ఎన్ఎస్ కంపెనీ మొక్కజొన్న పంట కొనుగోలు చేసింది. కానీ ఇంత వరకు డబ్బులు మాత్రం చెల్లించలేదు. అప్పటి నుంచి కంపెనీ యాజమాన్యం దాటవేస్తూ వచ్చింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో కర్నూలు రైతుల నిరసన
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు చేసి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా కంపనీ యాజమాన్యం ముఖం చాటేసింది. న్యాయం చేయాలని ఆశ్రయించిన పోలీసులు పట్టించుకోవడం లేదు. ఎలాగైనా తమ కష్టార్జితం రాబట్టుకునేందుకు కర్నూలు నుంచి హైదరబాద్‌కు వచ్చి నిరసనకు దిగారు.
హైదరాబాద్‌లో కర్నూలు రైతుల నిరసన
బకాయిలు చెల్లించకుండా ముఖం చాటేసిన యాజమాన్యం తీరుకు నిరసనగా రైతులు ఆందోళన బాట పట్టారు. 20మంది రాత్రి కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వచ్చి వ్యాపారి జిలాని ఇంటి ముందు వంటావార్పుతో నిరసన తెలిపారు. తమకు రావాల్సిన 80 లక్షలు చెల్లించే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. దీనిపై మీడియా వివరణ కోరగా కంపెనీ ఉద్యోగి నిర్లక్ష్యపు సమాధానంతో దాటవేశారు.
ఇదీ చూడండి:రహదారిపై రారాజుల సంచరిస్తూ.. భయం పుట్టిస్తున్న పెద్దపులి