Karnataka CM Response to KTR : బెంగళూరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను హైదరాబాదుకు ఆహ్వానిస్తూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు చేసిన ట్వీట్ హాస్యాస్పదమని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పేర్కొన్నారు. ‘వ్యాపార, వాణిజ్య రంగ ప్రముఖులు ప్రపంచ నలుమూలల నుంచి బెంగళూరుకు తరలి వస్తుంటారు. అతి ఎక్కువ అంకుర, యునికార్న్ సంస్థలు ఉన్న బెంగళూరు అత్యధిక ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. రాష్ట్రం గత మూడేళ్లుగా ఆర్థికంగా ప్రగతి సాధిస్తోంది’ అంటూ గుర్తు చేశారు.
Karnataka CM Fires on KTR : మంత్రి కేటీఆర్ ట్వీట్.. కర్ణాటక సీఎం బొమ్మై సీరియస్ - కేటీఆర్ ట్వీట్‌పై కర్ణాటక సీఎం ఆగ్రహం
Karnataka CM Response to KTR : బెంగళూరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ గత మూడ్రోజులుగా ట్విటర్‌లో దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ ట్వీట్‌పై కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ స్పందించగా తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై గట్టిగా జవాబిచ్చారు.
మీరు ఎన్నో స్థానంలో ఉన్నారు? :కేటీఆర్ ట్వీట్‌పై కర్ణాటక భాజపా కూడా ట్విటర్‌లో ఘాటుగా స్పందించింది. ఆకాశాన్ని కొలిచే ముందు అంగుళాన్ని కొలవడం నేర్చుకోవాలని ట్వీట్ చేసింది. ‘మన పళ్లెంలో ఈగ పడినా పట్టించుకోని వారు పక్కింటి వారి పళ్లెంలో ఈగ గురించి మాట్లాడటం సహజం. తెలంగాణలో ఏం జరుగుతుందో దేశానికి తెలుసు. గాలం వేసే రాజకీయాలతో ఉనికిని కోల్పోతున్న కేసీఆర్ సర్కారు అభివృద్ధి గురించి బెంగళూరుతో సవాలు చేయడం హాస్యాస్పదం. వ్యాపారవేత్తలను హైదరాబాదుకు ఆహ్వానించిన కేటీఆర్... విదేశీ పెట్టుబడుల స్వీకరణలో మీరు ఎన్నో స్థానంలో ఉన్నారు? కర్ణాటకకు మీకూ ఎంత వ్యత్యాసం ఉందో ముందు విశ్లేషించుకొన్నారా? విదేశీ పెట్టుబడులు, ఐటీ- బీటీ, నవ్యాలోచనల వంటి అన్ని రంగాల్లో బెంగళూరు పెట్టుబడిదారులకు స్వర్గం. నవ భారతం కోసం నవ బెంగళూరు అనే సంకల్పంలో రాజీ లేదు. పొరుగు రాష్ట్రాలపై ఇలాంటి దురహంకార పోటీ మీకు తిరుగుబాణం కాగలదు...’ అంటూ హెచ్చరించింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన నవ్యాలోచన సామర్థ్యంలో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా, తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని గుర్తు చేసింది.