తెలంగాణ

telangana

ETV Bharat / city

Kanipakam Laddu : కాణిపాకం గణేశుని లడ్డూ తెలంగాణకే దక్కింది! - కాణిపాకం ఆలయం పూజలు

ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆఖరి రోజు వినాయకుని లడ్డూ(Kanipakam Laddu) వేలం వేయగా 3 లక్షల 4వేల రూపాయలకు తితిదే బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు దక్కించుకున్నారు.

కాణిపాకం గణేశుని లడ్డూ వేలం.. దక్కించుకున్న తెలంగాణ వాసి
కాణిపాకం గణేశుని లడ్డూ వేలం.. దక్కించుకున్న తెలంగాణ వాసి

By

Published : Oct 1, 2021, 1:21 PM IST

Updated : Oct 1, 2021, 2:53 PM IST

చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆఖరి రోజు తెప్పోత్సవం సందర్భంగా గణేశుని లడ్డూ వేలం నిర్వహించారు. 21 కేజీల బరువున్న లడ్డూ మహా ప్రసాదాన్ని బహిరంగ వేలం వేయగా చుట్టు పక్కల గ్రామస్థులతో పాటుగా... ఇతర ప్రాంతాల భక్తులూ పాల్గొన్నారు.

ఈ వేలంలో అత్యధికంగా 3 లక్షల 4వేల రూపాయలకు తితిదే బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన మురంశెట్టి రాములు ఈ లడ్డూను ముఖ్యమంత్రి కేసీఆర్​కు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేశు, ఐరాల జడ్పీటీసీ సుచరిత, ఆలయ ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​కు కాణిపాకం లడ్డూ బహుమతి
Last Updated : Oct 1, 2021, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details