పేదల సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్‌లోని పలు డివిజన్లలో కోటికిపైగా విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎమ్ఆర్ఎఫ్ చెక్కులను నామాలగుండులోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముషీరాబాద్, మారేడుపల్లి రెవిన్యూ మండలాల పరిధిలోని సీతాఫల్‌మండీ, బౌద్ధనగర్, అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక డివిజన్లకు చెందిన 120 మందికి చెక్కులు అందజేశారు. ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఇలాంటి పథకాలను సీఎం ప్రవేశపెట్టారని తెలిపారు.
డబ్బులు ఇవ్వొద్దు: