జనవరి 28 తేదీ నుంచి 31 వరకు గోవాలో జరిగిన జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా రైల్వే కోడూరు ఆర్ఎస్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభతో 18మంది బంగారు పతకాలు సాధించగా...ఇద్దరు రజత పతకాలు సొంతం చేసుకున్నారు. జాతీయ చాంపియన్‌షిప్‌నూ కైవసం చేసుకున్నారు. వారిలో 8 మంది ఈనెల 24న నేపాల్‌లో జరిగే అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు పిలుపు అందుకున్నారు.
కనీస సౌకర్యాలు లేకున్నా...
గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వీరంతా సాధనకు అందుబాటులో సరైన కనీస సౌకర్యాలు లేకున్నా... బాక్సింగ్‌లో రాణిస్తున్నారు. ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి...దేశానికి ,రాష్ట్రానికి గుర్తింపు తెస్తామని ఆశాభావంవ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఆర్ఎస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఈ విద్యార్థులు... స్కూల్ గేమ్స్‌లోనూ మంచి ప్రతిభ కనబరిచారు. కేరళ, తమిళనాడు, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో జరిగిన థాయ్ బాక్సింగ్ లోనూ పలు పతకాలు సొంతం చేసుకున్నారు.