తెలంగాణ

telangana

ETV Bharat / city

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే... సమతామూర్తి విగ్రహం: నారాయణ

CPI NARAYANA NEWS: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే ముచ్చింతల్​లో సమతా మూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. సమ్మక్క సారక్కలు.. విప్లవ వీరులు వారిపై చిన్నజీయర్ స్వామి అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో రాజ్​గురు, భగత్​సింగ్, సుఖ్​దేవ్​ల వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హజరయ్యారు.

CPI NARAYANA
CPI NARAYANA

By

Published : Mar 24, 2022, 7:07 PM IST

CPI NARAYANA NEWS: కోట్లాది మంది భక్తి శ్రద్ధలతో కొలిచే మేడారం సమ్మక్క సారక్క జాతరను అవమానించడం సరైన పద్ధతి కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేట్ మున్సిపాలిటీ పరిధిలోని రావి నారాయణరెడ్డి కాలనీలో రాజ్​గురు, భగత్​సింగ్, సుఖ్​దేవ్​ల వర్ధంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, చెడు వ్యసనాలపై యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హాజరై మాట్లాడారు.

'లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే ముచ్చింతల్​లో సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సమ్మక్క సారక్కలు.. విప్లవ వీరులు వారిపై చిన్నజీయర్ స్వామి అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలి. యువత భగత్​సింగ్, రాజ్​గురు, సుఖ్​దేవ్​ల ఆశయ సాధన కోసం కృషి చేయాలి. భగత్​సింగ్ ఆశయాలకు విరుద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. డ్రగ్స్ మాఫియాని అంతం చేస్తామన్న ప్రధాని.. అదాని రూపంలో మాదకద్రవ్యాల సరఫరాను ప్రోత్సహిస్తున్నారు.'

-సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

యువత దేశ రాజకీయాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు. చెడు వ్యసనాలను ప్రోత్సహించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాలని సూచించారు.

ఇదీ చదవండి:NBW on BJP MP: భాజపా ఎంపీకి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details