తిరుమల(Tirumal) శ్రీవారి ఆలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏటా జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రంలో తితిదే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. శ్రీవారి ఆలయ సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును "అభిద్యేయక అభిషేకం" అని వ్యవహరిస్తుంటారు.
Tirumala: నేటినుంచి తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం - telangana news
తిరుమల(Tirumal) శ్రీవారి ఆలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం కార్యక్రమాన్ని తితిదే నిర్వహించనుంది. శ్రీవారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏటా జరిపిస్తారు.
తిరుమల, తితిదే
తరతరాలుగా చేస్తున్న అభిషేకాలతో... అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఏటా ఈ ఉత్సవాన్ని జరిపిస్తారు.
ఇదీ చదవండి:Cm Kcr: దత్తత గ్రామంలో సీఎం పర్యటన... గ్రామస్థులతో సహపంక్తి భోజనం