తెలంగాణ

telangana

ETV Bharat / city

నేడు రాజ్‌భవన్‌కు కేసీఆర్‌? - జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఉదయం 10.05 గంటలకు గవర్నరు తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరు కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

kcr
kcr

By

Published : Jun 28, 2022, 5:33 AM IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఉదయం 10.05 గంటలకు గవర్నరు తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు అనంతరం అయిదో ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరు కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మంత్రులు, ఉన్నతాధికారులు సైతం పాల్గొననున్నట్లు సమాచారం. గవర్నర్‌ వైఖరిపట్ల అసంతృప్తితో ఉన్న సీఎం కేసీఆర్‌ గత కొంత కాలంగా రాజ్‌భవన్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన చివరిసారిగా గత ఏడాది అక్టోబరు 11న రాజ్‌భవన్‌కు వెళ్లారు. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details