సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) రెండోసారి ఏపీలో పర్యటించనున్నారు. రేపు కర్నూలు జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు పటిష్ఠ బందోబస్తు పూర్తి చేశారు. ఇటివలే సీజేఐ హోదాలో తొలిసారిగా తిరుమల శ్రీవారిని జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు.
JUSTICE NV RAMANA: రేపు శ్రీశైలం పర్యటనకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ - జస్టిస్ ఎన్వీ రమణ తాజా సమాచారం
సీజేఐ ఎన్వీ రమణ (CJI NV Ramana) రేపు ఏపీలోని కర్నూలు జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లనున్నారు. శుక్రవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో తొలిసారి పర్యటించిన సీజేఐ యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ ఆలయాన్ని సందర్శించారు.
శ్రీశైలం పర్యటనకు సీజేఐ ఎన్వీ రమణ
సీజేఐగా పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన ఆయన యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ ఆలయాన్ని సందర్శించారు. హైదరాబాద్ వచ్చి రాజ్‌భవన్‌లో బస చేసిన సీజేఐ ఎన్వీ రమణను గత 4 రోజులుగా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కలిశారు.
ఇదీ చదవండి:KTR: ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీతో ఏం లాభం జరిగింది..?