తెలంగాణ

telangana

ETV Bharat / city

JUDA'S STRIKE: సాయంత్రం నిర్ణయం చెబుతాం: జూడాలు - judas strike in telangana news

ఇవాళ సాయంత్రం తమ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నామని.. అందులో చర్చించి సమ్మె కొనసాగించాలా.. విరమించాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని జూడాలు స్పష్టం చేశారు. పరిహారం మినహా ఇతర డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

judas strike news
తెలంగాణలో జూడాల సమ్మె

By

Published : May 27, 2021, 3:55 PM IST

సమ్మె విరమణ లేదా కొనసాగింపుపై ఈ సాయంత్రం నిర్ణయం ప్రకటిస్తామని జూనియర్ వైద్యులు వెల్లడించారు. పరిహారం విషయంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పారని.. మిగతా డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు.

వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీతో బీఆర్కే భవన్​లో విద్యార్థి వైద్యులు చర్చలు జరిపారు. మిగతా అన్ని డిమాండ్లపై సానుకూలంగా స్పందించారని...లిఖితపూర్వకంగా హామీ ఇవ్వలేదన్నారు. ఉత్తర్వుల జారీకి రెండు రోజుల సమయం పడుతుందని రిజ్వీ చెప్పారని జూడాలు తెలిపారు. సాంకేతిక సమస్యలు ఉన్నందున పరిహారం విషయంలో ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని కోరినట్లు పేర్కొన్నారు.

అత్యవసర సేవలు బహిష్కరిస్తామని ప్రకటించినా.. ప్రజలకు ఇబ్బంది కలిగించరాదనే ఉద్దేశంతోనే సేవలు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సాయంత్రం తమ సర్వసభ్య సమావేశంలో చర్చించి.. సమ్మె విరమణ లేదా కొనసాగింపుపై నిర్ణయం ప్రకటిస్తామని జూడాలు పేర్కొన్నారు.

తెలంగాణలో జూడాల సమ్మె

ఇవీచూడండి:JUDA's Strike: ముగిసిన చర్చలు.. సమ్మె విరమణపై సాయంత్రం నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details