తెలంగాణ

telangana

ETV Bharat / city

రైతు బజార్​ నుంచి ప్రజా రవాణా వరకు సకలం నిర్బంధం - హైదరాబాద్​లో తెలంగాణలో జనతా కర్ఫ్యూ ప్రభావం

కరోనా వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ ప్రకటించారు. దీనికి పూర్తి మద్దతు తెలిపిన రాష్ట్ర సర్కార్​ 24 గంటలపాటు ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. జనతా కర్ఫ్యూలో భాగంగా రాష్ట్రంలోని దేవాలయాలు, దవాఖానాలు, వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు.

కళావిహీనంగా హైటెక్​ సిటీ ప్రాంతం
రైతు బజార్​ నుంచి ప్రజా రవాణా వరకు సకలం నిర్బంధం

By

Published : Mar 22, 2020, 12:33 PM IST

కరోనా మహమ్మారిని తరిమికొట్టే ప్రక్రియలో భాగంగా విధించిన జనతా కర్ఫ్యూకు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజలంతా స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు, ఆర్టీసీ, సింగరేణి సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి.

రహదారులన్నీ నిర్మానుష్యం
ఉప్పల్​ బస్టాండ్​లో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు

ప్రధాని మోదీ ఒక్క పిలుపుతో మహా యాగంలా కరోనాపై యుద్ధం సాగుతోంది. నిత్యం రద్దీగా ఉండే... హైదరాబాద్​ వెస్ట్​జోన్, పంజాగుట్ట సర్కిల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

మేము సైతం
ఉప్పల్​ బస్టాండ్​లో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు

రైతు బజార్ల నుంచి మొదలై... ప్రజా దవాఖాన, ప్రజా రవాణా వరకు అన్ని స్వచ్ఛందంగా బంద్​లో పాల్గొంటున్నాయి.

కళావిహీనంగా హైటెక్​ సిటీ ప్రాంతం

చెప్పినా వినరే
చెప్పినా వినరే

జనతా కర్ఫ్యూపై ప్రజలకు.. మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజాప్రతినిధులు, పోలీసులు, ప్రముఖులు ఎంత అవగాహన కల్పించినా.. కొంత మంది రహదారులపై తిరుగుతున్నారు. వారిని నిలువరించిన పోలీసులు ఇంటికి వెళ్లాలని సూచిస్తున్నారు.

ఇళ్లలోనే ఉండండి
ఇంట్లోనే ఉండాలంటూ ట్రాఫిక్​ పోలీసు అవగాహన

భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ పోలీసులు కరోనా వైరస్​ వ్యాప్తి నివారణపై అవగాహన కల్పించారు. ప్రజలంతా ఇంటి వద్దే ఉండాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో వైరస్​ బారిన పడకుండా ఉండొచ్చని తెలిపారు.

చార్మినార్​ వద్ద రసాయనాల స్ప్రే

ABOUT THE AUTHOR

...view details