ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్థలపై(aided schools and colleges) సర్కారు నిర్ణయం దారుణంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(janasena president pawan kalyan) అన్నారు. అప్పుడు 'అమ్మ ఒడి' ఇచ్చి.. ఇప్పుడు 'అమ్మకానికో బడి' అన్నట్లు పాలన చేస్తున్నారని ఆక్షేపించారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రైవేటు పరం(privatization) చేయాలనే సర్కారు నిర్ణయంతో 2.5 లక్షల మంది విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, సిబ్బంది, వారి కుటుంబాలు అతలాకుతలమయ్యాయని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్‌ను పూర్తిగా గాలికి వదిలేశారని, సర్కారు నిర్ణయంతో విద్యార్థులే బలిపశువులయ్యారని పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి దురుద్దేశాలు ఉన్నాయా..?
ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనానికి ప్రభుత్వం( AP government) ఎందుకు తొందరపడుతుందో సమాధానం చెప్పాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. విద్యాసంవత్సరం మధ్యలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని మండిపడ్డారు. ఇది ఆర్టీఈ(RTE) సూత్రాల ఉల్లంఘన కాదా? అని అన్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా?, వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, టీచర్ల పోస్టులను(Teachers posts) ఎప్పుడు భర్తీ చేస్తారని పవన్ కల్యాణ్(janasena president pawan kalyan) ప్రశ్నించారు.