తెలంగాణ

telangana

ETV Bharat / city

గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుత పాలకులు కొనసాగించాలి: పవన్ - amaravathi farmers protest news

రాజధాని మార్పుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏకపక్షమేనని జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ అన్నారు. రాజధాని రైతులు భూములు ఇచ్చింది ప్రభుత్వానికి తప్ప.. ఏ పార్టీకో, వ్యక్తులకో కాదన్నారు. అప్పటి ప్రభుత్వం చేసిన ఒప్పందాలను ప్రస్తుత పాలకులు గౌరవించాలని స్పష్టం చేశారు. రాజధాని రైతుల త్యాగాలను వృథా కానీయమని.. అమరావతి ఉద్యమానికి సంపూర్ణ మద్దతిస్తామని జనసేనాని తేల్చి చెప్పారు.

గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుత పాలకులు కొనసాగించాలి: పవన్
గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుత పాలకులు కొనసాగించాలి: పవన్

By

Published : Jul 6, 2020, 8:06 PM IST

అమరావతి రైతుల త్యాగాలు వృథాకానీయబోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చెప్పారు. రాజధాని కోసం 34 వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులకు బాసటగా నిలుస్తామని పునరుద్ఘాటించారు. రాజధాని అమరావతి మార్పుపై ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం రైతులను అవమానించడమేనని పవన్​ అన్నారు. రాజధానిని 3 ముక్కలు చేస్తేనే అభివృద్ధి వికేంద్రీకరణ కాదని పేర్కొన్నారు. రాజధానిని పరిరక్షించుకొనేందుకు 200 రోజులుగా రైతులు, రైతు కూలీలు, మహిళలు అలుపెరగని పోరాటం చేస్తున్నారని.... వారికి జనసేన సంఘీభావం తెలుపుతుందన్నారు.

గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుత పాలకులు కొనసాగించాలి: పవన్

ప్రస్తుత పాలకులు ఆ నిర్ణయం గౌరవించాలి..

ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని... తర్వాత వచ్చే పాలకులు అమలు చేస్తూ మరింత పురోగతికి ప్రణాళికలు సిద్ధం చేయాలి తప్ప దాన్ని అడ్డుకోకూడదన్నారు. రైతులు భూములు ఇచ్చింది ప్రభుత్వానికే కానీ.. ఒక వ్యక్తికో, పార్టీకో కాదన్నారు. రాష్ట్రంలో అన్ని ‌ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాజధానిని తరలింపు నిర్ణయం సరికాదని పవన్ అన్నారు.

అమరావతి రైతులకు ఇవ్వాల్సిన కౌలుపై నిర్లక్ష్యం తగదని.. ‌ఆందోళన చేస్తే తప్ప ప్రభుత్వం కౌలు నిధులు విడుదల చేయట్లేదని పవన్​ మండిపడ్డారు. ఏప్రిల్​ కౌలు ఇప్పటికీ ఇవ్వకపోవడం రైతులను వేదనకు గురి చేయడమేనని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : పేదల విద్యుత్​ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details