యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు కలిసి రావాలని ఎంపీ రేవంత్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు నేతృత్వంలో యురేనియంపై అఖిలపక్ష సమవేశం సోమవారం జరగనుంది. హైదరాబాద్ దస్పల్లా హోటల్‌లో ఉదయం పది గంటలకు నిర్వహించనున్న ఈ అఖిలపక్ష సమావేశానికి రావాలని రేవంత్ రెడ్డిని పవన్‌కల్యాణ్ ఆహ్వానించారు. పవన్ విజ్ఞప్తి మేరకు అఖిలపక్షం సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
ఎంపీ రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ ఫోన్ - పవన్ కల్యాణ్
కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్‌రెడ్డికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. నల్లమల యురేనియం అంశంపై కలిసి పోరాటం చేద్దామని సూచించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం భేటీకానున్న అఖిలపక్ష సమావేశానికి రేవంత్‌ను ఆహ్వానించారు.
pawan kalyan
Last Updated : Sep 14, 2019, 8:34 PM IST