వర్షాలు, వరదల పరిస్థితిని జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. జిల్లా అధికారులు, ఇంజినీర్లతో ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ క్షేత్రస్థాయి పరిస్థితులను ఆరా తీస్తున్నారు. గోదావరి నదిలోకి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో అధికారులు, ఇంజినీర్లను పూర్తి అప్రమత్తం చేశారు.
వరంగల్ గ్రామీణ జిల్లాకు ప్రత్యేకంగా నీటిపారుదల అధికారిని నియమించారు. పరిస్థితుల పర్యవేక్షణ కోసం దేవాదుల చీఫ్ ఇంజనీర్‌ను ములుగు వెళ్లాలని ఆదేశించారు. హైదరాబాద్ జలసౌధలో 24 గంటల పాటు పనిచేసేలా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. చీఫ్ ఇంజనీర్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.