రాష్ట్రంలో జలవనరులశాఖ పునర్‌వ్యవస్థీకరణ కసరత్తు ప్రక్రియ పూర్తైంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచనలకు అనుగుణంగా అధికారులు అవసరమైన మార్పులు, చేర్పులు చేశారు. పెరుగుతున్న ఆయకట్టుకు అనుగుణంగా భౌగోళిక పరిధులను దృష్టిలో ఉంచుకొని పునర్‌వ్యవస్థీకరణ జరగాలని సీఎం స్పష్టం చేశారు. అన్నిఅంశాలను పరిగణలోకి తీసుకొని రెండు మూడు సార్లు జలవనరులశాఖ ఉన్నతాధికారులు, ఈఎన్సీలు సమావేశమై కసరత్తు పూర్తిచేశారు.
నీటిపారుదల శాఖ పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా సిద్ధం! - నీటిపారుదల శాఖ తెలంగాణ
రాష్ట్రంలో జలవనరులు శాఖ పునర్‌వ్యవస్థీకరణ కసరత్తు పూర్తైంది. సీఎం సూచనలకు అనుగుణంగా మార్పులు చేసిన అధికారులు.. మంగళవారం తుది కసరత్తు చేసి ప్రజంటేషన్ సిద్ధం చేశారు. సీఎం పరిశీలన అనంతరం రాష్ట్ర జలవనరులశాఖ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియకు ఆమోదం లభించనుంది.
నీటిపారుదల శాఖ పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా సిద్ధం!
మంగళవారం తుదికసరత్తు చేసి.. అవసరమైన ప్రజెంటేషన్‌ను సిద్ధం చేశారు. జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, ఈఎన్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజెంటేషన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించిన తర్వాత.. రాష్ట్ర జలవనరులశాఖ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియకు ఆమోదం లభించనుంది.
ఇవీ చూడండి:బిహార్‌ను ముంచెత్తుతున్న వరదలు