తెలంగాణ

telangana

ETV Bharat / city

'వైరస్‌ను ఆలస్యంగా గుర్తించడం వల్లే ఊపిరితిత్తులపై ప్రభావం'

రాష్ట్రంలో మహమ్మారి కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిర్ధరణ పరీక్షలను ప్రభుత్వం తగ్గించటం వల్ల ప్రైవేటులో పరీక్షలు చేపించుకునేందుకు పరిగెత్తే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. మరోవైపు హోం ఐసోలేషన్​లో ఉన్నవారు సైతం వైరస్ తీవ్రతతో ఇటీవల ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం... హోం ఐసోలేషన్​లో ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టెస్టింగ్ ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్య ముఖాముఖి...

Ipm Director Shankar interview On Covid precautions
Ipm Director Shankar interview On Covid precautions

By

Published : Apr 30, 2021, 8:29 PM IST

'వైరస్‌ను ఆలస్యంగా గుర్తించడం వల్లే ఊపిరితిత్తులపై ప్రభావం'

"మ్యుటేషన్‌ ఏదైనా వైరస్‌ను నియంత్రించడమే లక్ష్యం. రెండోదశ తీవ్రంగా ప్రభావం చూపుతోంది. వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉంది. లక్షణాలున్న వారు మాత్రమే పరీక్షలకు వెళ్లాలి. ఇంట్లో ఎవరికైనా వైరస్‌ సోకితే కుటుంబమంతా హోంఐసోలేషన్‌లో ఉండాలి. వైరస్‌ను వేగంగా గుర్తించడం వల్ల త్వరగా కోలుకోవచ్చు. వైరస్‌ను ఆలస్యంగా గుర్తించడం వల్లే... ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోంది. 80శాతం మందికి హోంఐసోలేషన్‌లోనే ఉంటూ కోలుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు యువత నిర్లక్ష్యంగా ఉండకూడదు."

-ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్​

ఇదీ చూడండి: జర్నలిస్టుల కోసం హెల్ప్​లైన్​... రేపటి నుంచే అందుబాటులోకి..

ABOUT THE AUTHOR

...view details