తెలుగు కవులు, రచయితలను ప్రోత్సహించేలా... ఖండకావ్య, పద్య రచనల పోటీల నిర్వహణకు ఏపీలో కృష్ణా జిల్లా అవనిగడ్డలోని మండలి ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఔత్సాహికులను పోటీలకు ఆహ్వానించింది. తెలుగువారి హృదయాలలో చెరగని ముద్ర వేసేలా చిన్న ఖండికలతో కూడిన ఖండ కావ్య పద్య రచనలు చేయాలని మండలి ఫౌండేషన్ అధ్యక్షుడు బుద్ధప్రసాద్ సూచించారు.
ఖండకావ్య, పద్య రచన పోటీలు.. కవులకు మండలి ఫౌండేషన్ ఆహ్వానం! - mandali foundation news
తెలుగు భాష ఔచిత్యాన్ని నేటి తరాలకూ అందించేందుకు ఏపీలో కృష్ణా జిల్లా అవనిగడ్డలోని మండలి ఫౌండేషన్ నడుం బిగించింది. ఖండ కావ్య, పద్య రచన పోటీలకు కవులు, రచయితలకు ఆహ్వానం పలికింది. ఫౌండేషన్ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్.. తన తండ్రి మండలి వెంకటకృష్ణారావు జయంతిని పురస్కరించుకుని కార్యక్రమం చేపట్టారు.
invitation-to-poetry-writing-competitions-by-mandali-foundation-at-avanigadda-in-krishna-district
మంచి రచనలు చేసిన వారికి బహుమతులు, ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. రచనల ప్రచురణ బాధ్యత తామే చూసుకుంటామని చెప్పారు. కవులు, రచయితలు తమ రచనలను జూలై 21 లోగా తమ చిరునామాకు పంపాలని మండలి బుద్ధప్రసాద్ తెలిపారు.