తెలంగాణ

telangana

ETV Bharat / city

సరుకు రవాణా రంగంలోకి.. ఆర్టీసీ.?

ప్రజారవణా వ్యవస్థలో దూసుకెళ్తున్న ఆర్టీసీ.. ఇప్పుడు సరుకు రవాణా రంగంలోకి అడుగుపెడుతోంది. దీనికోసం అధికారులు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీలో నష్టాల బారిన నడిచే రూట్లలో తిరిగే పాత బస్సులను ఇప్పుడు సరుకు రవాణాకు వినియోగించబోతున్నారు. ఇవాళ బస్‌భవన్‌లో డీవీఎంలతో సమావేశం నిర్వహించి.. సరుకు రవాణాకు అవసరమైన విధివిధానాలు రూపొందించనున్నారు.

సరుకు రవాణా రంగంలోకి.. ఆర్టీసీ
సరుకు రవాణా రంగంలోకి.. ఆర్టీసీ

By

Published : Dec 10, 2019, 5:34 AM IST


ఆర్టీసీ.. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రజా రవాణ వ్యవస్థ. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సరుకు రవాణా రంగంలోకి ప్రవేశిస్తోంది. గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిన్న జరిగిన డిపో మేనేజర్లతో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సరుకు రవాణా రంగంలోకి.. ఆర్టీసీ

ట్రిప్పులను తగ్గిస్తే.. ఎలా ఉంటుంది..
నష్టాలు వచ్చే రూట్లలో, ప్రజలు తక్కువ శాతం ప్రయాణించే సమయాల్లో బస్సుల ట్రిప్పులను తగ్గిస్తే.. ఎలా ఉంటుంది తదితర అంశాలపై.. బస్ భవన్‌లో డివిజనల్ మేనేజర్లతో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకున్నారు.

ఆర్టీసీ బస్సులో సరుకు రవాణా..?
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసేందుకు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గోదాములను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిల్లోకి సరుకు తరలించేందుకు వందల సంఖ్యలో లారీలను వినియోగిస్తున్నారు. ఇవన్నీ ప్రైవేటు వాహనాలే. ఇప్పుడు ఈ సరుకు రవాణాలో ఆర్టీసీ బస్సు సేవలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత విభాగాలకు ఇవాళ బస్ భవన్‌లో సమావేశం నిర్వహించిన అనంతరం ఈమేరకు ఆదేశాలు జారీ చేసేందుకు యోచిస్తున్నారు.

ఆదాయం భారీగానే వస్తుంది..
ఈ విధానం అమలు చేస్తే ఆర్టీసీకి భారీగానే ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ యూనియన్ నేతలు అంగీకరిస్తున్నారు.
రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి - ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్

కేవలం గ్రేటర్ పరిధిలోనే - కోటి నష్టం
ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో రోజుకు సుమారు కోటి రూపాయలు నష్టం వస్తుంది. దీనిని తగ్గించుకోవాలంటే.. అందుకు తగ్గట్లు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఈడీ.. డీఎంలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ @ నష్టాలు, లాభాలు

  • బస్టాండ్ల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. కాలనీల్లోనే బస్సు ఎక్కే వసతి కల్పిస్తూ ప్రవేశపెట్టిన వజ్ర ఏసీ బస్సులు ఆర్టీసీకి నష్టాలు తీసుకువస్తున్నాయి. వీటిపై సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
  • ఏసీ వసతితో ఉండే వజ్రా మినీ బస్సులను ఇక సరుకు రవాణా బస్సులుగా మార్చితే.. ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది.
  • వజ్ర సేవలను ఆర్టీసీ 2017 మే నెలలో ప్రారంభించింది. తొలుత 40, ఆ తర్వాత మరో 20 బస్సులు కొనుగోలు చేశారు. ముందుగా మెహిదీపట్నం, కుషాయిగూడ, మియాపూర్‌ డిపోలకు వీటిని కేటాయించారు.
  • ఆ తర్వాత నగరం నుంచి వరంగల్, నిజామాబాద్‌, కరీంనగర్, గోదావరిఖనిలకు విస్తరించారు. కండక్టర్, టిమ్‌ యంత్రం లేకుండా నేరుగా ఆర్టీసీ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకునే విధానం ప్రవేశపెట్టారు. కానీ ఈ బస్సులకు ప్రయాణికుల నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు.

ఇవీ చూడండి: 'ఆర్టీసీపై భేటీ సమయంలో.. గుండె వేగంగా కొట్టుకుంది'

ABOUT THE AUTHOR

...view details